Anchor Ravi: హిందువులను కించపరచే ఉద్దేశం నాకులేదు 4 d ago

యాంకర్ రవి, ఇటీవల జరిగిన వివాదాస్పద స్కిట్ పై స్పందిస్తూ, అది హిందువులను కించపరచే ఉద్దేశంతో చేయలేదని స్పష్టం చేశారు. "నేను చత్రపతి శివాజీను ఫాలో అయ్యే వ్యక్తినని, హనుమాన్ చాలీసా చదివే హిందువునే అని " చెప్పారు. ఆ వీడియోను డిలీట్ చేశారని, మత విశ్వాసాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు. సామజిక మాధ్యమంలో తన నంబర్ పెట్టి హిందూ మతాన్ని హర్ట్ చేశానని పెట్టారని, దీంతో తనకు చాలా కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానన్నారు.